Saturday, January 18, 2025
HomeTrending Newsమోటర్లకు మీటర్లతో 98 లక్షల కుటుంబాలపై భారం - కెసిఆర్

మోటర్లకు మీటర్లతో 98 లక్షల కుటుంబాలపై భారం – కెసిఆర్

మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లుపై జరిగిన లఘు చర్చలో సీఎం కేంద్రంపై మండిపడ్డారు. కేంద్రం మీటర్లు పెడితే 98 లక్షల కుటుంబాలపై భారం పడుతుందని చెప్పారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా విద్యుత్ సవరణ బిల్లును తెచ్చారని ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రతి పక్షాలు ఏమైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి నోరు నొక్కడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విద్యుత్ బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే అసత్యాలు చెప్పారన్న సీఎం… ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ లేకుంటే కనెక్షన్ కట్ చేయాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లులో ఉందన్నారు. విద్యుత్ బిల్లును అమలు చేస్తేనే ఎఫ్ఆరీ బీఎం పరిధి పెంచుతామని కేంద్రం చెబుతోందన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్న సీఎం… ఇష్టమొచ్చినట్లు చట్టాలు తెస్తూ రాష్ట్రాలు అమలు చేయాలని అంటోందని విమర్శించారు. కానీ రాష్ట్ర సర్కారు విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ తప్ప మరొకటి లేదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ వెతలు ఎలా ఉండేవో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. అనేక సందర్భాల్లో కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం, కరెంట్ బిల్లులు కట్టలేక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడటం ఉమ్మడి రాష్ట్రంలో కామన్ గా ఉండేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సింగరేణి కాలరీస్ లో రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు కల్పించారన్నారు. అలాగే సీలేర్ పవర్ ప్రాజెక్ట్ ను రాష్ట్రానికి కేటాయించారని అన్నారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక… తన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లనే రాష్ట్ర మండలాలను లాక్కున్నారని ఫైర్ అయ్యారు. కనీసం సీలేర్ పవర్ ప్రాజెక్ట్ నైనా ఇస్తారనుకుంటే అది ఇవ్వలేదన్నారు.

విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కలిసి వచ్చే రాష్ట్రాల ప్రజలతో కలిసి దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Also Read రైతాంగ సమస్యలపై జమిలి పోరాటాలు  కెసిఆర్ పిలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్