Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్25న ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్

25న ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఈ నెల 25న జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కౌంటింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పనలో అవక తవకలు జరిగాయని, సవరణలలో తప్పులు దోర్లాయని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, పోలింగ్ జరుపోకోవచ్చని, కానీ కౌంటింగ్ నిలిపివేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది.  మొత్తం 50 డివిజన్లు ఉన్న ఏలూరు కార్పోరేషన్ లో మార్చి 10న  పోలింగ్ జరిగింది. 56.33 శాతం ఓట్లు పోలయ్యాయి. తదుపరి విచారణ జరిగిన అనంతరం  మే 7వ తేదీన హైకోర్టు తీర్పు ఇస్తూ కౌంటింగ్ కు అనుమతి మంజూరు చేసింది. అయితే కోవిడ్ కారణంగా కర్ఫ్యూ అమల్లో ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కు సమయం తీసుకుంది.

కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో హైకోర్టు తీర్పు దృష్ట్యా కోవిడ్ నిబంధలను పాటిస్తూ జూలై 25న ఆదివారం కౌంటింగ్ చేపట్టనుంది. అదేరోజు ఫలితాలు విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్