Saturday, January 18, 2025
HomeTrending Newsమైదుకూరులో YS షర్మిలకు యువకుడి సమాధానం

మైదుకూరులో YS షర్మిలకు యువకుడి సమాధానం

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు సోమవారం ఎన్నికల ప్రచారంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కడప ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఈ రోజు మైదుకూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ..  ఏపీ అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారో ఎవరైనా వివరించాలని షర్మిల ప్రజలనుద్దేశించి వ్యగ్యంగా ప్రశ్నించారు.

దీనికి స్థానిక యువకుడు వై.చంద్ర ఓబుల్ రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు. జగన్‌ను మళ్లీ అధికారంలోకి ఎందుకు తీసుకురావాలి అనేదానికి అతను వివరణాత్మక కారణాలను చెప్పాడు (ప్రాథమికంగా అతను గత 5 సంవత్సరాలలో చేసిన అన్ని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాడు.) సభకు హాజరైన వారిలో జగన్ పథకం అందుకొని వారు లేరని అన్నాడు.

ఆ తర్వాత షర్మిలను ప్రశ్నిస్తూ..  తెలంగాణలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, తెలంగాణ ప్రజలను మధ్యలోనే ఎలా వదిలేశారని ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేయకుండా వచ్చిన మిమ్మల్ని ఎలా నమ్మేదని అడిగాడు.

కుటుంబ వ్యవహారాలు.. వ్యక్తిగత కక్షలను రాజకీయాల్లోకి తీసుకురావద్దని షర్మిలకు హితవు పలికాడు. యువకుడి ప్రసంగం ఆసాంతం విన్న ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేయటం కొసమెరుపు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలే తనకు స్టార్ కామ్పైనర్లని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెపుతున్నట్టుగా యువకుడు స్పందించాడని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి.

–దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్