పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రతి సినిమా సెట్స్ పై ఉంది. క్రిష్ తో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘బ్రో’ సినిమాలు వరుసగా షూటింట్ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు సుజీత్ దర్శకత్వంలో స్టైలిష్ గ్యాగ్ స్టర్ డ్రామాగా ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో ప్రధాన విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడిని ఎంపిక చేశారు. ఆ విషయాన్ని గురువారం చిత్ర బృందం ప్రకటించింది. ఓజీ లో మెయిన్ విలన్‌గా బాలీవుడ్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటించబోతున్నారు. సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టీమ్ వెల్లడించింది.
నిన్నటి వరకు ఈ కార్యరెక్టర్ లో బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్లర్ నటిస్తారని ప్రచారం జరిగింది. ఆయనతో టీమ్ సంప్రదిస్తోందని, ఫర్హాన్ అక్తర్ కూడా పవన్ సినిమాలో విలన్ గా నటించడానికి అంటగీకరించారని వార్తలు వినిపించాయి. అయితే ఓటీ టీమ్ మాత్రం ఫైనల్‌గా ఈ మూవీలో విలన్‌గా ఇమ్రాన్ హష్మీ నటిస్తారని ప్రకటించి రూమర్స్‌కు చెక్ పెట్టింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.