Wednesday, March 18, 2026
HomeTrending Newsసిఎంకు దేవాదాయ శాఖ ఆహ్వానం

సిఎంకు దేవాదాయ శాఖ ఆహ్వానం

విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు.  డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, వేద పండితులు క్యాంపు కార్యాలయంలో సిఎం ను కలుసుకొని ఆహ్వాన పత్రిక అందించారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 17 వరకు  ఏపీ ప్రభుత్వం–దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం, అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరగనుంది.

దీనితో పాటు శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి 31 వరకు మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవంలో కూడా పాల్గొనాలని సిఎంను ఆహ్వానించారు.

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు   జగన్‌కు తీర్ధప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular