Wednesday, March 11, 2026
HomeTrending Newsమహిళా లోకానికి స్ఫూర్తి ఈశ్వరీబాయి - కెసిఆర్

మహిళా లోకానికి స్ఫూర్తి ఈశ్వరీబాయి – కెసిఆర్

దళితులు,అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని ( డిసెంబరు 1 ) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆమెకు నివాళులర్పించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారిణిగా ఆమె సాగించిన సాహస పోరాటాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన నాటి కాలంలో ఈశ్వరీబాయి ఒక దళిత మహిళగా పోరాట స్ఫూ ర్తిని ప్రదర్శిస్తూ, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తీరు నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు.
తెలంగాణ గర్వించే బిడ్డగా ఈశ్వరీబాయి అనుసరించిన విలువలు స్పూర్తిని రేపటి తరానికి అందించాలనే లక్ష్యంతో, గత పాలనలో విస్మరించబడిన ఈశ్వరీబాయి జయంతిని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సిఎం స్పష్టం చేశారు.

ఈశ్వరీబాయి వంటి ప్రజాస్వామిక వాదుల ఆశయాల ప్రేరణతో, తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారతను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. ఈశ్వరీబాయి వంటి దళిత ప్రజాస్వామిక వాదుల స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సిఎం అన్నారు. దళితుల ఆర్థిక సామాజిక ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దళిత బహుజన, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను కొనసాగించాలనే స్పృహను యావత్ దేశంలోని పాలక వ్యవస్థకు కలిగించేందుకే తెలంగాణ సచివాలయానికి డా. బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని, 125 అడుగులతో,దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్నిఏర్పాటు చేసుకుంటున్నామని సిఎం అన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ప్రేరణగా నిలుస్తున్నదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular