Tuesday, September 17, 2024
HomeTrending NewsBotanical Garden: హైదరాబాద్ లో వృద్దుల కోసం వ్యాయామ శాల

Botanical Garden: హైదరాబాద్ లో వృద్దుల కోసం వ్యాయామ శాల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా బోటానికల్ గార్డెన్ లో వృద్ధుల కొరకు నూతన వ్యాయామశాల ఏర్పాటు చేశారు. వ్యాయామశాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిధిగా, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా సీనియర్ సిటిజన్స్ కార్యక్రమానికి హాజరై సంతోషం వ్యక్తం చేసారు.

వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బోటనికల్ గార్డెన్ ను అన్ని హంగులతో 2 సంవత్సరాలలో సుందరంగా తీర్చిదిద్దినటువంటి వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డిని కొనియాడారు. రోజూ బోటనికల్ గార్డెన్ కు వందల మంది విసిటర్స్ వస్తున్న క్రమంలో అందులో ఎంతో మంది వృద్దులు ఉదయం సాయంత్రం వాకింగ్ వస్తూ వారికి ఉపయోగపడే ఫెసిలిటీ ఏమి లేదని ఎం. డి. ఆలోచన చేసి, వారి కోసం ఈ యొక్క ఓపెన్ జిమ్ ను ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం అని హర్షం వ్యక్తం చేశారు.

వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 3 నెలల క్రితం తాను బోటనికల్ గార్డెన్ పనులను ఇన్స్పెక్షన్ చేసే క్రమంలో నా దగ్గరకు ఒక సీనియర్ సిటిజెన్ వచ్చి సార్ ఈ గార్డెన్ లో మగ వాళ్లకి ఒక జిమ్ వుంది, ఆడ వాళ్లకి ఒక జిమ్ వుంది కానీ వృద్దుల గురించి ఏమైనా ఆలోచన చేయండి అని అడిగారు. వెంటనే ఆ రోజు వృద్దుల జిమ్ ఎలా ఉండాలి, వారి యొక్క కంటి చూపుకి పదను, ఫ్లోర్ హుడిల్స్, స్టెప్ మరియు రాంప్ assist, స్టెప్ assist, లెగ్ ఎక్సటెన్షన్, వెర్టికల్ షోల్డర్ పుల్, షోల్డర్ ట్విర్ల వంటి పరికరాలు బోటానికల్ గార్డెన్ కు వస్తున్నటువంటి విసిటర్స్ మరియు వాకర్స్ కోసం తయారు చేయించామని తెలియచేశారు. బోటనికల్ గార్డెన్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని అనేక రకాల మొక్కలకు బోటనికల్ గార్డెన్ హైదరాబాద్ లో పుట్టినిల్లుగా మారేలా చెర్యలు చెప్పడతామని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ ఐ.ఎఫ్.స్., డైరెక్టర్ ఎం. జె. అక్బర్, జి. ఎం. రవీందర్ రెడ్డి, ఓ. ఎస్. డి. టి. పి. తిమ్మారెడ్డి, సీనియర్ డి. ఎం మరియు అసిస్టెంట్ డైరెక్టర్ డా. జి. స్కైలాబ్, ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మానేజర్ సుమన్, ప్లాంటేషన్ మేనేజర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, హాజీ బాషా, సీనియర్ సిటిజెన్స్ ఎకోటూరిజం సిబ్బంది మరియు టి. ఎస్. ఎఫ్. డి సి. సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్