Thursday, September 19, 2024
Homeసినిమాపాపం .. నితిన్ బాగానే కష్టపడ్డాడుగానీ .. !

పాపం .. నితిన్ బాగానే కష్టపడ్డాడుగానీ .. !

Movie Review:   నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజక వర్గం‘ సినిమా రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ నెల 12వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. టైటిల్ ను బట్టే రాజకీయాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమైపోతుంది. ఒక వైపున ప్రేమ .. మరో వైపున రౌడీయిజంతో కూడిన రాజకీయం .. ఆ మధ్యలో కొన్ని ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. రాజశేఖర్ రెడ్డికి ఎడిటర్ గా మంచి అనుభవం ఉంది .. కానీ దర్శకుడిగా మాత్రం ఆయనకి ఇదే మొదటి సినిమా.

నితిన్ వంటి స్టార్ హీరో  .. అందునా తాను వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి వంటి కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం రిస్క్ తో కూడిన వ్యవహారం. అయినా నితిన్ ఆ రిస్క్ తీసుకున్నాడు. అయితే అందుకు తగిన ఫలితం  దక్కలేదనే అనిపిస్తోంది. కథలోగానీ .. కథనంలోగాని .. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో గాని రాజశేఖర్ రెడ్డి కొత్తదనాన్ని చూపించలేకపోయాడు. కథలో ట్విస్టులు కనిపించవు .. ఔరా అనిపించవు. ఏదో సినిమాలో .. ఎక్కడో చూసినట్టుందే అన్నట్టుగానే సీన్స్ తగులుతుంటాయి. దర్శకుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రను వేసే ప్రయత్నం చేయలేదనిపిస్తుంది.

ఇక సంగీతం విషయానికి వస్తే అంజలి ఐటమ్ సాంగ్ లో కొన్ని మాటలు అర్థమవుతాయి. మిగతా పాటల్లో వాయిద్యాల హోరు ఎక్కువ .. సాహిత్యం వినిపించదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనానికి వంకబెట్టవలసిన అవసరం లేదు. ఎడిటింగ్ కూడా ఫరవాలేదు. వెన్నెల కిశోర్ పాత్రను సెకండాఫ్ లో సరిగ్గా ఉపయోగించు కోలేదు. కేథరిన్ పాత్ర శుద్ధ అనవసరంగా అనిపిస్తుంది. కృతి పాత్ర సరిగ్గా డిజైన్ చేయనిదిగా కనిపిస్తుంది. క్లైమాక్స్ లోని  చిన్న ట్విస్ట్ కోసం సముద్రఖని డ్యూయెల్ రోల్ ను జనాలపై రుద్దడం కరెక్ట్ కాదనిపిస్తుంది. హ్యాండ్సమ్ గా కనిపిస్తూ డాన్సులతో .. ఫైట్లలో నితిన్ చెలరేగిపోయాడుగానీ, కథలో దమ్ముంటే ఆయన కష్టం ఫలించేదేమో!

Also Read : ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతుల మీదుగా ‘కళాపురం’ ట్రైలర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్