Saturday, January 18, 2025
Homeసినిమారవితేజ అభిమానుల్లో పెరుగుతున్న అసహనం!

రవితేజ అభిమానుల్లో పెరుగుతున్న అసహనం!

No Updates: రవితేజ ఎప్పటిలానే ఒకదాని తరువాత ఒకటిగా వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ఆ మధ్య కరోనా విజృంభించిన సమయంలో కథలను సెట్ చేసుకున్న రవితేజ, ఆ తరువాత వెంటవెంటనే ఆ ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. ఆయన స్పీడ్ చూసి కుర్ర హీరోలు సైతం కంగుతున్నారు. అలా ఆయన ప్రాజెక్టుల జాబితాలో నుంచి ముందుగా ప్రేక్షకులను పలకరించడానికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ రెడీ అవుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా దివ్యాన్ష కౌశిక్ – రజీషా విజయన్ అలరించనున్నారు.

ఈ సినిమా తరువాత రవితేజ మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఆ తరువాత నుంచి అప్ డేట్స్ లేవు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏ పరిస్థితుల్లో ఉన్నది తెలియదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తరువాత తెరపైకి రావలసిన సినిమా ఇదే. అయినా ఎక్కడా అందుకు సంబంధించిన సందడి మాత్రం  కనిపించడం లేదు. ఏ షెడ్యూల్ ఎక్కడ నడుస్తుందనే సమాచారం లేదు.

ఇక రవితేజ చేస్తున్న మిగతా రెండు సినిమాల పరిస్థితి కూడా అంతే ఉంది. రవితేజ హీరోగా సుధీర్ వర్మ ‘రావణాసుర’ టైటిల్ పోస్టర్ ను వదిలి చాలాకాలమే అవుతోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు కనువిందు చేయనున్నట్టు చెప్పారు. వాళ్లలో అనూ ఇమ్మాయేల్ – మేఘా ఆకాశ్ ముఖ్యంగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ‘టైగర్ నాగేశ్వరావు’  కూడా పట్టాలెక్కింది. వంశీ  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడం పట్ల అభిమానులు అసహనానికి లోనవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్