Saturday, January 18, 2025
HomeTrending Newsఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు

ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు

Exemption For Aryavaishya Satras From The Scope Of Revenue Act :

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, చౌల్ట్రీలను ఏపీ ధార్మిక హిందూ సంస్థలు, దేవాదాయ చట్టం నుంచి మినహాయిస్తూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇక నుంచి ఆర్యవైశ్య సంఘాల పరిధిలోనే ఇవి పనిచేస్తాయని స్పష్టం చేశారు. పాలనాపరమైన అంశాల్లో అవకతవకలు ఉన్నట్టుగా వెల్లడైతే తక్షణం ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేస్తుందని షరతు విధించారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశం సందర్భంగా ఆర్యవైశ్య సంఘాలు సీఎం జగన్‌ను కలిసి దీనిపై విజ్ఞాపన పత్రం ఇవ్వటంతో ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

Must Read :ఘనంగా శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్సవాలు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్