Thursday, May 8, 2025
HomeTrending NewsGoshamahal: ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Goshamahal: ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు. చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. ప్రాణం పోతున్నా.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడనని తెగేసి చెప్పారు.

తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని తన లక్ష్యమని, బీజేపీ గనుక టికెట్‌ ఇవ్వకుంటే.. రాజకీయాలకు దూరంగా ఉంటానని అయితే  హిందూ రాష్ట్రం కోసం పని చేస్తానన్నారు. బీజేపీ అధిష్టానం తన విషయంలో సానుకూలంగా ఉందని, సరైన టైంలో వేటు ఎత్తేస్తుందన్న నమ్మకం ఉందని భరోసా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌, ఎంఐఎంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది. అందుకే పెండింగ్ పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కానీ ఇండిపెండెంట్‌గా కాని.. వేరే పార్టీల నుంచి కాని పోటీ చేయను అని స్పష్టం చేశారు.

మళ్లీ గోషా మహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తానని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ చేతిలో లేదని రాజా సింగ్ చెప్పారు. అక్కడ బీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టాలనేది నిర్ణయించేది ఎంఐఎం పార్టీయేనని ఆరోపించారు. ఓవైసీ సోదరులు ఎవరి పేరు చెబితే వారికే కేసీఆర్ టికెట్ ఇస్తారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్