Sunday, January 19, 2025
Homeసినిమా'ఎక్స్ట్రా' ఆర్డినరీ మేన్ అందుకనే స్పెషల్!  

‘ఎక్స్ట్రా’ ఆర్డినరీ మేన్ అందుకనే స్పెషల్!  

నితిన్ హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆడియన్స్ తో ఎక్కడా గ్యాప్ రానీయలేదు. తన సినిమాలు హిట్ అయినప్పుడు అదే స్పీడ్ తో వెళ్లాడు .. ఫ్లాప్ అయినప్పుడు కూడా అదే స్పీడ్ ను మెయింటెన్ చేశాడు. ‘భీష్మ’ సినిమా నుంచి నితిన్ కి హిట్ లేదు. అందువలన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. తన నుంచి ఈ నెల 8వ తేదీన రానున్న ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమాపైనే ఆయన దృష్టి పెట్టాడు. కథపై ఉన్న నమ్మకంతో ఆయనే ఈ సినిమాను నిర్మిస్తూ ఉండటం విశేషం. హీరోయిన్ గా శ్రీలీల చేసిన సంగతి తెలిసిందే.

ఇక నితిన్ కి మాత్రమే కాదు .. దర్శకుడిగా వక్కంతం వంశీకి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. వక్కంతం వంశీ గతంలో రచయితగా కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత ఆయన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. బన్నీ హీరోగా భారీ బడ్జెట్ తో 2018లో వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. అప్పటి నుంచి దర్శకుడిగా మరో ఛాన్స్ కోసం వక్కంతం వంశీ వెయిట్ చేస్తూనే వచ్చాడు. చాలా గ్యాప్ తరువాత ఆయనకి ఈ సినిమాతో అవకాశం దక్కింది.

ఇక ఈ సినిమాలో రాజశేఖర్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. సరైన రోల్ పడితే కీలకమైన పాత్రలు .. విలన్ రోల్స్  చేయడానికి చాలా కాలం క్రితమే సంసిద్ధతను వ్యక్తం చేసిన రాజశేఖర్, అలా ఈ సినిమాలో కనిపించనున్నారు. ‘శేఖర్’ సినిమా తరువాత హీరోగా ఆయన నుంచి మరో సినిమా రాలేదు. కొంత గ్యాప్ తరువాత తెరపై ఆయన కనిపించే సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమా హిట్ ఆయన కెరియర్ కి కూడా అవసరమే. అందువలన హిట్ కోసం వెయిట్ చేస్తున్న వీరందరికీ, ఈ సినిమా స్పెషల్ అనే చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్