Sunday, September 8, 2024
Homeసినిమానవ్వుల చిత్రీకరణ మళ్ళీ మొదలెట్టిన ‘ఎఫ్-3’

నవ్వుల చిత్రీకరణ మళ్ళీ మొదలెట్టిన ‘ఎఫ్-3’

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ‘ఎఫ్-3’ రాబోతోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.

సినిమా ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్టును రెడీ చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ హైద్రాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది.

ఎఫ్ 2 సినిమాలో అద్భుతమైన ట్యూన్లు అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ‘ఎఫ్-3’ కోసం స్పెషల్ ట్యూన్లను సిద్దం చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్