Saturday, September 21, 2024
Homeసినిమావెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ టాకీ పార్ట్ పూర్తి

వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ టాకీ పార్ట్ పూర్తి

Summer Comedy: సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ‘ఎఫ్ 3’ సినిమాతో వేసవికి మూడు రెట్లు వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఎఫ్ 2’ కు సీక్వెల్ గా రాబోతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్రేడ్ వర్గాల్లో ఉన్న క్రేజ్, సినిమా మీద వచ్చిన పాజిటివ్ వైబ్స్ దృష్ట్యా సినిమాకు సంబంధించిన అప్డేట్లతో మేకర్లు అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్ అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు.

వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్ ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్-కెమెరామెన్, తమ్మిరాజు ఎడిటర్ గా  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్