Monday, March 16, 2026
Homeసినిమామే 9న 'ఎఫ్3' ట్రైలర్

మే 9న ‘ఎఫ్3’ ట్రైలర్

Trailer is on the way: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘F3‘ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పుడా అంచనాలు మరింత పెంచడానికి మే 9న F3 థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్.

రెండు పాటలు, పోస్టర్‌లు మినహా ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ విడుదల చేయనప్పటికీ సినిమా బిగ్ బజ్‌ని క్రియేట్ చేస్తుంది. చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేయడం లేదు. నేరుగా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. F3 ఫన్ రైడ్ ట్రైలర్‌ను చూసేందుకు మరో వారం రోజులు వేచి ఉండాల్సిందే. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా వచ్చిన రెండో పాట ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించి ట్రెండింగ్ లో వుంది.

తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

Also Read :‘ఎఫ్3’ లో రోల్ కెరీర్ లోనే ది బెస్ట్ : మెహ్రీన్  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular