Sunday, March 15, 2026
Homeసినిమామే 27నుంచి నవ్వులు పూయించనున్న‘ఎఫ్ 3’

మే 27నుంచి నవ్వులు పూయించనున్న‘ఎఫ్ 3’

F3-May 27: ఎఫ్ 2 మూవీకి సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఫ్యామిలీ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేక‌ర్స్. ఎఫ్3లో భార్య బాధితులుగా కనిపించిన వెంకటేష్, వరుణ్ తేజ్ చేతిలో మెగాఫోన్ లు పట్టుకుని వారిని భయపెట్టడం ఆసక్తిని సంతరించుకుంది.

రాజేంద్రప్రసాద్, వెంకటేష్, వరుణ్ తేజ్ తో ఉండగా….తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్ మరొక వైపు ఉన్నారు. మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా చేయడానికి ఎఫ్ 3 కుటుంబం సిద్ధంగా ఉంది. బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని కమర్షియల్ హంగులతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎఫ్ 3 మూవీని రూపొందిస్తున్నారు.

మొదటి పాటతో పాటు ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సాయి శ్రీరామ్ కెమెరా మెన్ గా చేయగా, తమ్మిరాజు ఎడిటర్. హర్షిత్ రెడ్డి సహ నిర్మాత. ఎఫ్ 2 సినిమా వ‌ల‌నే ఎఫ్ 3 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ఖాయ‌మ‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

Also Read : ‘ఎఫ్-3’ అంత‌కు మించి అనేలా ఉంటుంది : అనిల్ రావిపూడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular