Wednesday, March 18, 2026
HomeTrending Newsపాతబస్తీలో పాగా వేస్తున్న ఉగ్రవాదులు - బండి సంజయ్

పాతబస్తీలో పాగా వేస్తున్న ఉగ్రవాదులు – బండి సంజయ్

ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు ధారాదత్తం చేసిన కేసీఆర్…దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. అల్లర్లు స్రుష్టించి కేంద్రాన్ని బదనాం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తుశుద్ధి ఉంటే…. సీబీఐ విచారణ జరిపించాలని హైదరాబాద్ లో డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాల్లేకుండా 27 వేలకుపైగా బర్త్, 4వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడం ఆందోళన కలిగించే అంశమన్నారు. జారీ చేసిన బర్త్ , డెత్ సర్టిఫికెట్లలో ఎక్కువగా పాతబస్తీలోనే బయటపడటం తీవ్రమైన అంశం…కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అంతులేని అవినీతికి ఇది నిదర్శనమని విమర్శించారు. దీనికంతటికి మొదటి ముద్దాయి సీఎం కేసీఆరే. నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి.

బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్ పోర్టులు పొంది, హైదరాబాద్ లో అడుగుపెట్టి పాతబస్తీని అడ్డగా మార్చి దేశంలో అల్లర్లు స్రుష్టించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పాతబస్తీ ఐఎస్ఐ కేంద్రంగా మారింది. స్లీపర్ సెల్స్ ను పెంచి పోషిస్తున్నరు. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ఇక్కడే మూలాలు బయటపడుతున్నాయన్నారు. ఎంఐఎం చెప్పినట్లు ఆడుతున్నాడు. మా పర్మిషన్ లేకుండా పాతబస్తీలోకి అడుగుపెట్టే దమ్ముందా? అని, 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఒవైసీ సోదరులు సవాల్ విసిరినా నోరు మెదపని చేతగాని దద్దమ్మ కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లు స్రుష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. తద్వారా కేంద్ర వైఫల్యంగా చిత్రీకరించి రాజకీయ లబ్ది పొందే నీచమైన కుట్రలకు తెరదీశారని ఆరోపించారు.

టాస్క్ ఫోర్స్ దాడి చేసిన కొన్ని మీ సేవా కేంద్రాల్లోనే 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. పాతబస్తీ మొత్తం జల్లెడ పడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు బయటపడే అవకాశం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. వీటితోపాటు రేషన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు కూడా పొంది పాతబస్తీ పౌరులుగా చలామణి అవుతూ హైదరాబాద్ సహా ప్రధాన నగరాలన్నింటిల్లో అల్లర్లు స్రుష్టించి భారతదేశాన్ని విచ్చిన్నం చేసేందుకు పెద్ద కుట్ర చేసినట్లు తెలుస్తోందన్నారు. తక్షణమే పాతబస్తీలో జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు రేషన్ కార్డు, ఓటర్ కార్డులపై సమగ్ర దర్యాప్తు చేయించాలి. ప్రభుత్వ పెద్దల, ఎంఐఎం నేతల హస్తం లేనిదే ఇంత పెద్ద సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం లేనందున సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular