Monday, February 24, 2025
HomeTrending Newsవిద్యా సంస్థలపై తప్పుడు ప్రచారం

విద్యా సంస్థలపై తప్పుడు ప్రచారం

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

పాఠశాల ప్రాంగణాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు ధరించి,భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని, విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Also Read : పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి

RELATED ARTICLES

Most Popular

న్యూస్