Tuesday, March 10, 2026
HomeసినిమాRajinikanth: అంచనాలు పెంచేస్తున్న 'జైలర్'

Rajinikanth: అంచనాలు పెంచేస్తున్న ‘జైలర్’

రజనీకాంత్ నుంచి ఒక సినిమా వస్తుందంటే సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక ఆయన అభిమానులు చేసే హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ సారి ‘జైలర్’ విషయంలో అంచనాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమాకు తోడవుతూ వస్తున్న విశేషాలే. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కథలో ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ ఏదో ఒక విశేషాన్ని జోడిస్తూ వెళ్లాడు. వివిధ భాషలకి చెందిన సీనియర్ స్టార్స్ ను తీసుకోవడం అందులో భాగమే.

మల్లూ ఉడ్ నుంచి మోహన్ లాల్ ..  శాండల్ ఉడ్ నుంచి శివరాజ్ కుమార్  .. బాలీవుడ్ నుంచి జాకీష్రాఫ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ కారణంగా సినిమా భారీ తనం పెరగడమే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లపై కూడా ప్రభావం కనిపించనుంది. ఇంతమంది స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా అదే స్థాయిలో బిజినెస్ జరుపుకుందని అంటున్నారు. ఓపెనింగ్స్  విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకి అనిరుధ్ అందించిన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ గా నిలవనున్నట్టుగా తెలుస్తూనే ఉంది. రజనీ నుంచి వదిలిన ‘హుకూమ్’ సాంగ్ .. తమన్నా బృందంపై చిత్రీకరించిన  ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ ట్రెండింగులో సాగుతున్నాయి. ‘ఇక్కడ నేనే కింగ్ .. నేను చెప్పిందే శాసనం’ అనే రజనీ డైలాగ్, ఆయన అభిమానుల్లో హుషారు పెంచుతోంది. ఇక చాలా గ్యాప్ తరువాత రజనీతో కలిసి రమ్యకృష్ణ నటించడం కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇలా అన్ని వైపులా నుంచి అంచనాలు పెంచుతూ ఈ నెల 10వ తేదీన వస్తున్న ఈ సినిమా, ఏ రేంజ్ లో దూసుకుపోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular