Sunday, January 19, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందా?

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందా?

Sequel for RRR?: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేన్లో రూపొందిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25న ప్ర‌పంచవ్యాప్తంగా భారీస్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. జక్కన్న మార్క్ మేకింగ్ తో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల్ని విజువల్ ట్రీట్ తో ఆకట్టుకుటుంది. ఇక చరణ్, తారక్ అభిమానులు అయితే.. సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌.. ఇద్దర్నీ ఒకే ప్రేమ్ లో చూసుకుని మురిసిపోతున్నారు. ఇదే ఉత్సాహంలో ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ చేయాలంటూ జక్కన్న పై అప్పుడే ఒత్తిడి మొదలైందట‌. ఆర్ఆర్ఆర్ కి కొనసాగింపుగా సీక్వెల్ తీస్తే బాగుంటుందని చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారట‌. అయితే.. ఇది జరగడం అన్నది అంత వీజీ కాదు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ ని రెండు భాగాలు చేస్తామని  ఏనాడు రివీల్ చేయలేదు. చెప్పాల్సిన కథని ఒకే కథగా ఇద్దరి హీరోలతో ముగించారు.

పైగా ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ ఉండదని దర్శకుడు రాజమౌళి ఇది వరకే క్లారిటీ ఇచ్చారు. అందుచేత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉండ‌క‌పోవ‌చ్చు. ఒక‌వేళ అభిమానుల డిమాండ్ మేర‌కు రాజ‌మౌళి సీక్వెల్ గురించి ఆలోచిస్తారేమో..?  ఏది ఏమైనా క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Also Read : ఆర్ఆర్ఆర్ సునామి: 3 రోజుల్లో 500 కోట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్