టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మీద ఆరోపణలు, అరెస్టు జరిగిన ప్రాంతం ఒకటి అయితే వీరాభిమానులు చేస్తున్న హంగామా మరో ప్రాంతం. బాబుకు మద్దతుగా “లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్” కార్యక్రమం – చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం – ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణం – మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం – చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వెల్లడి
దేనికోసం వీళ్ళ తాపత్రయం చంద్రబాబును విడుదల చేయాలనా… అవినీతికి ప్రాల్పడ లేదని చెప్పే యత్నమా… చూసే వారు విస్తు పోతున్నారు. మెట్రో ఫర్ సీబీఎన్ కు వచ్చిన వారిలో చాలామంది బాబు విడుదల కావాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వలేకపోతున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రయాణం ఎవరిని ఇబ్బంది పెట్టనీకి చేస్తున్నారు. దసరా సెలవులు, ఈ రోజు నుంచే బతుకమ్మ సంబరాలు మరోవైపు ఎన్నికల కోలాహలంతో పోలీసులు సతమతమవుతున్నారు. రోడ్ల మీద ఉదయం ఎనిమిది కావస్తున్నా రద్దీ చక్కదిద్దే పరిస్థితి లేదు.
బతుకమ్మకు పులు కొనేవారు…పండుగకి కొత్త దుస్తులు కొనే వాళ్ళతో నగరంలో అన్ని ప్రాంతాలు రద్దీగా ఉన్నాయి. పార్టీల ప్రచారం… వారికి బందోబస్తుతో పోలీసులు నానా యాతన పడుతున్నారు.
ఇలా ఎవరి హడావిడిలో వాళ్ళు భాగ్యనగరంలో ఉంటె… ఊరోనికి ఊరు ఆపతి అంటే, ఊసు కల్లోనికి దోమల ఆపతి అని తెలంగాణ పల్లెల్లో సామెత ఉంది. అలా ఉంది టిడిపి అభిమానుల సంగతి. బస్సు రావటం లేదని ఒకడు బాధపడుతుంటే… ఎహే ఆగు కళ్ళ మీదకు దోమలు వస్తున్నాయి అని పాచి ముఖం వాడు అన్నాడట.
రోడ్ల మీద రద్దీ ఒత్తిడి తట్టుకోలేక కార్యాలయాలకు మెట్రోలో వెళుతుంటే…కాలు పెట్టె సందు లేని మెట్రోలో తెలుగుదేశం అభిమానులు హంగామా చేయటంపై తోటి ప్రయాణికులు విసుక్కుంటున్నారు. వెళ్ళే వాళ్ళు ఊరికే వెలుతున్నారా…నినాదాలు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు.
వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రావటం…దాంతో మెట్రో ఆగిపోవటం… వెళ్ళాల్సిన గమ్యానికి రైళ్ళు ఆలస్యంగా వెళుతున్నాయి. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో హైదరాబాద్ లో ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసినా ఎవరి దృష్టి మరల్చేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు విడుదల కన్నా ప్రచారం ఆర్భాటం పైనే తెలుగు తమ్ముళ్ళు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మొదట్లో బాబు విడుదల కోరుకున్నా ఇప్పుడు రాజకీయం చేసి రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలనే తాపత్రయం కనిపిస్తోంది.
-దేశవేని భాస్కర్
Also Read: Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్ 9కి వాయిదా