Sunday, September 8, 2024
Homeసినిమా'థ్యాంక్యూ' నుంచి ఫేర్ వెల్ సాంగ్ విడుదల

‘థ్యాంక్యూ’ నుంచి ఫేర్ వెల్ సాంగ్ విడుదల

Farewell: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన‌ కొత్త సినిమా “థ్యాంక్యూ“. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “మనం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వ‌ర‌కు విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, రెండు పాటలు “మారో..”, “ఏంటో ఏంటేంటో…” చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ఈ చిత్ర నుంచి ఫేర్ వెల్ అనే పాటను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు విక్రమ్ కె కుమార్, సంగీత దర్శకుడు థమన్, ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ..థ్యాంక్యూ ఒక బ్యూటిఫుల్ మూవీ. మన జీవితంలో చిన్నప్పటి నుంచి గొప్ప స్థాయికి చేరుకునే వరకు ఎంతోమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం. మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలో తెలుస్తుంది. ఈ సినిమా చూశాక మీరది అనూభూతి చెందుతారు. దర్శకుడు విక్రమ్ కు చాలా పెద్ద మనసుంది. ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు. దిల్ రాజు గారి పేరులోనే దిల్ ఉంది. ఆయన సంస్థలో నేను మూడు సినిమాలు చేస్తున్నాను. మజిలీ, థ్యాంక్యూ సినిమాల్లో చైతూ లుక్స్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాగ చైతన్యలో నాగార్జున కనిపించారు. ఈ ఫేర్ వెల్ సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు అన్నారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ… మనందరి జీవితాల్లో బెస్ట్ టైమ్ కాలేజ్ లైఫ్. ఆ తర్వాత అంతా ప్రపంచంతో పోటీ పడుతూ పరుగులు పెట్టాల్సిందే. మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలే జీవితాంతం మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఈ కాలేజ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయండి. యూత్ సినిమాను ఎలా ఇష్టపడతారో అనేదే ఆలోచిస్తాం. రిలీజ్ రోజే థ్యాంక్యూ సినిమా చూడండి. సోషల్ మీడియా ద్వారా మీ స్పందన చెప్పండి. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తుంటాను. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు విక్రమ్ కుమార్ కు కృతజ్ఞతలు చెబుతున్నా. మూడేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం. జూలై 22న సినిమా చూడండి అన్నారు.

Also Read :  మళ్ళీ వాయిదాప‌డిన‌ థ్యాంక్యూ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్