Saturday, January 18, 2025
Homeసినిమాఫరియాకి ఈ సారైనా హిట్ పడేనా?

ఫరియాకి ఈ సారైనా హిట్ పడేనా?

ఫరియా అబ్దుల్లా .. హైదరాబాద్ అమ్మాయి .. తెలుగు బ్యూటీ. ‘జాతిరత్నాలు’ సినిమాతో  వెండితెరపై ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. యూత్ హృదయాలను దోచేసింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం.. పాప్యులర్ కావడం చాలా తక్కువమంది హీరోయిన్స్ విషయంలో జరుగుతూ ఉంటుంది. అరుదైన ఆ సంఘటన ఫరియా విషయంలో కూడా జరిగింది. ‘జాతిరత్నాలు’ సినిమాలో ఈ బ్యూటీని చూసి కుర్రాళ్లంతా ఆమె అభిమానులుగా మారిపోయారు. ఆమె ఫాలోవర్స్ జాబితాలో చేరిపోయారు.

మంచి హైట్ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఫరియా సొంతం. ఆమె నవ్వు ప్రధానమైన ఆకర్షణ. అందువలన ఇక ఈ అమ్మాయి దూకుడును ఆపడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థాయి స్పీడ్ తో ఫరియా ముందుకు వెళ్లలేకపోయింది. ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపించే ఆమె హైట్, కొన్ని అవకాశాలకు అడ్డుపడుతూ వచ్చింది. అయినా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు వెళుతూనే వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో హిట్స్ పడకపోవడం దురదృష్టకరం.

ఈ నేపథ్యంలోనే అల్లరి నరేశ్ సరసన ఆమె ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేసింది. మల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన విడుదల కానుంది. అల్లరి నరేశ్ మంచి హైట్ కావడంతో జోడీ కుదిరింది అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫరియా పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందనీ, ఆమె పాత్ర ఆడియన్స్ కి చాలా ఫాస్టుగా కనెక్ట్ అవుతుందని అల్లరి నరేశ్ చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనీ, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఫరియా భావిస్తోంది. చూడాలి మరి ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్