Wednesday, February 26, 2025
Homeసినిమాఅందగత్తెకి కలిసి రావాలసింది అదృష్టమే! 

అందగత్తెకి కలిసి రావాలసింది అదృష్టమే! 

ఫరియా అబ్దుల్లా .. చందమామ లాంటి అమ్మాయి. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. అందమైన ఆమె నవ్వు చూసి మనసు పారేసుకున్నవారు చాలామందినే ఉన్నారు. ఈ బంజారా హిల్స్ బ్యూటీ ‘జాతిరత్నాలు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన ఖాతాలో హిట్ పడేలా చూసుకుంది. ఆ సినిమా రిలీజ్ తరువాత ఆమెను గురించి చెప్పుకున్నవారే  ఎక్కువ. ఇక ఆమె హవా కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు.

ఫరియా మంచి పొడగరి .. కాబట్టి మోడలింగులో ఆమెకి తిరుగుండదు .. ఎక్కువ హైట్ ఉన్న అమ్మాయిలకు అందరి హీరోల సరసన ఛాన్సులు రాకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అనుకున్నట్టుగానే ఆ తరువాత ఫరియా దూకుడు కనిపించలేదు. కొన్ని సినిమాల్లో ఐటమ్ గాను .. మరి కొన్ని సినిమాల్లో గెస్టు రోల్స్ లోను అమ్మడు మెరిసింది. ఆ సినిమాల్లో ఆమె అసలు హీరోయిన్ కంటే గ్లామరస్ గా కనిపించింది కూడా.

ఇటీవల ఆమె కథానాయికగా ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంతమాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. తన కెరియర్ కి ఎంతమాత్రం ఉపయోగపడని  ఈ తరహా పాత్రలను ఆమె ఎంచుకోకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వినిపించాయి.  ఇక రవితేజ ‘రావణాసుర’ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ లో ఆమె ఒకరిగా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉండనుందనేది పక్కన పెడితే, కాస్త ఆలస్యమైనా ఫరియా మంచి పాత్రలను ఎంచుకుంటేనే ఆమె ఈ రేసులో నిలబడగలుగుతుందనేది అభిమానుల మాట. అందగత్తెకి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్