Saturday, January 18, 2025
Homeసినిమా'దేవర' ఫియర్ సాంగ్: సాహిత్యాన్ని డామినేట్ చేసిన సంగీతం

‘దేవర’ ఫియర్ సాంగ్: సాహిత్యాన్ని డామినేట్ చేసిన సంగీతం

నేడు మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘దేవర’ నుంచి ఓ వీడియో సాంగ్ ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. కొరటాల శివ దర్శకతం వహిస్తోన్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్తి రచించిన ఈ సాంగ్ ను ‘ఫియర్ సాంగ్’ పేరిట విడుదల చేశారు. ‘దూకే ధైర్యమా, జాగ్రత్త, రాకే, ఎగబడి రాకే, దేవర ముంగట నువ్వెంత, దాక్కో’ అంటూ సాగే ఈ పాటను అనిరుద్ స్వయంగా ఆలపించాడు.

‘ఆర్ ఆర్ ఆర్’ అద్భుత విద్జయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో ఆయన అభిమానులంతా ‘దేవర’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో రూపొందిన ‘జనతా గ్యారేజ్’ ఘన విజయం సాధించింది. దాని తరువాత వీరిద్దరూ చేస్తున్న సినిమా ఇది. మరోవైపు ఆచార్య పరాజయంతో డీలాపడ్డ కొరటాల శివ ఈ సినిమాతో పూర్వ వైభవం సాధించాలని పట్టుదలతో ఈ సినిమాపై పని చేస్తున్నారు.

అయితే తాజాగా విడుదల చేసిన  ఫియర్ సాంగ్ లో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం భారీగా, స్థాయికి మించి ఉన్నా…. సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేసింది. పాట సరిగా వినపడడం లేదు. మరి జూనియర్ అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్