Saturday, January 18, 2025
HomeTrending Newsఇంట‌ర్ ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు

ఇంట‌ర్ ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు

తెలంగాణ ఇంట‌ర్ ప‌బ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఆల‌స్య రుసుంతో ప‌రీక్ష ఫీజును చెల్లించేందుకు మ‌రోసారి గ‌డువు పొడిగించారు. రూ. 100 ఆల‌స్య రుసుంతో ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లించొచ్చ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ అవ‌కాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాల‌ని అధికారులు సూచించారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థుల‌తో పాటు గ‌తంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేష‌న‌ల్ కోర్సుల విద్యార్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించొచ్చ‌ని బోర్డు తెలిపింది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఇంట‌ర్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 500 ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల నిమిత్తం అద‌నంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 710 చెల్లించాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్