Tuesday, March 10, 2026
HomeసినిమాFelicitation to Pregnant: 'మిస్టర్ ప్రెగ్నెంట్'' టీమ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం

Felicitation to Pregnant: ‘మిస్టర్ ప్రెగ్నెంట్” టీమ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం

తెలుగు తెరపై మంచి సినిమాలు, వినూత్న కాన్సప్ట్ తో వచ్చే సినిమాలను ప్రశంసించేందుకు నిత్యం ముందు వరుసలో ఉండే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్సిఏ )మరోసారి తెలుగు సినిమాకు ఘనంగా సత్కారం చేసింది. ”బలగం” సినిమాతో మొదలైన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన ”మిస్టర్ ప్రెగ్నెంట్” సినిమా టీమ్ నుప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా  సన్మానించింది.

ఈ సినిమా నిర్మాత అప్పిరెడ్డి, హీరో బిగ్ బాస్ ఫెమ్ సోహెల్,  దర్శకుడు శ్రీనివాస్ , మరో నిర్మాత రవీందర్ రెడ్డి , ఇతర నటీనటులు అభిషేక్ రెడ్డి, క్రాంతి, జ్యోస్నా, వర్షారెడ్డి, క్రాంతి, ప్రత్యూషలతో పాటు ఈ సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మరో సీనియర్ జర్నలిస్ట్ , ఎఫ్ సి ఏ మాజీ అధ్యక్షుడు ప్రభు హాజరై సినిమా టీమ్ ను అభినందించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్  అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి మసాదే లక్ష్మి నారాయణ, ఈసీ మెంబర్స్ అప్పాజీ, ఆర్ డి ఎస్ ప్రకాష్, నవీన్ కుమార్, వీర్ని  శ్రీనివాస్ పాల్గొని నటులను, సాంకేతిక నిపుణులను సన్మానించారు.

ఈ సందర్బంగా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ…. ఫిలిం క్రిటిక్స్ వారిచే ప్రశంసలు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిజానికి ఈ కాన్సప్ట్ ను తన వద్దకు తీసుకువచ్చింది రవీందర్ రెడ్డి అని అన్నారు. తనతో పాటు వెంకట్, రవీందర్ రెడ్డి అందరం ఎంతో ఇష్టంగా ఈ సినిమాను తెరకెక్కించమని అన్నారు. కమర్షియల్ గా ఎంత వచ్చింది అనే విషయాల కన్నా కూడా ఒక గొప్ప సినిమా తీశామన్న సంతృప్తి మిగిలిందని చెప్పారు. ఫిలిం క్రిటిక్స్ గాని, సినిమా చూసిన జనం కానీ  మెచ్చుకుంటుంటే మనసు పులకించిపోతోందని  అన్నారు. సోహెల్ సహకారం మరువలేనిదని చెప్పారు. దర్శకుడు శ్రీనివాస్ నుంచి మొదలు కొని ప్రొడక్షన్ లక్ష్మణ్ వరకు ప్రతి ఒక్కరు  ఇచ్చిన సహాయ సహకారాలు మరువలేనని అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular