Saturday, September 21, 2024
HomeTrending NewsNIMS: అమరవీరుల స్మారక చిహ్నానికి తుది మెరుగులు

NIMS: అమరవీరుల స్మారక చిహ్నానికి తుది మెరుగులు

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనులను ఆదివారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు.

మెట్రో పాలిటన్ కమిషనర్(HMDA) అరవింద్ కుమార్ కు నిర్మాణ ప్రాంగణ వెలుపల గల రోడ్డు, ఫుట్ పాత్, పలు సుందరీకరణ అంశాలపై పలు సూచనలు చేశారు.

అనంతరం.. ఈనెల 14న కొత్తగా ఆర్ అండ్ బి శాఖ ఆద్వర్యంలో నిర్మించే నిమ్స్ హాస్పిటల్ భవనానికి సీఎం శంకుస్ధాపన ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాంగణమంతా కలియ తిరిగారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ అండ్ బి శాఖ తరుపున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి,ఎస్.ఈ హఫీజ్,ఈ.ఈ శశిధర్, డి.ఈ మోహన్,మాధవి,నిమ్స్ డైరెక్టర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్