Sunday, March 8, 2026
HomeTrending Newsపంట రుణాల్లో జాప్యం తగదు – మంత్రి హరీష్

పంట రుణాల్లో జాప్యం తగదు – మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బి.ఆర్. కె.ఆర్ భవన్ లో SLBC  29 వ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో Annual Credit Plan ను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు.

రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సొమ్ము  ఇతర రుణాలకు  మళ్లించకుండా   వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారని, ఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను కోరారు. బ్యాంకర్లు పంట రుణాలను అందేలా చూస్తే రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరింత ముద్రా రుణాలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు.

          ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా,  ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, SLBC ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్.బి.ఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సిజిఎం వై. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular