Wednesday, March 18, 2026
Homeసినిమారేపే ‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ ఛార్జ్

రేపే ‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ ఛార్జ్

First Charge: యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెర‌కెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫైట్ మాస్ట‌ర్ అనల్ అరసు నేతృత్వం‌లో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేశారు.

ఈ సినిమా  ఫస్ట్ ఛార్జ్’ పేరుతో ఫస్ట్ లుక్‌ అప్‌డేట్‌ తో మేకర్స్ ముందుకు వచ్చారు. వినూత్నంగా మార్చి 26న  ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్న‌ట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుద‌ల చేశారు. మ‌రో వైపు, “ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది –  శ్రీ ఎన్ . సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్‌ని మార్చి26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు” అంటూ ఆర్డ‌ర్ కాపీలో పేర్కొన్నారు.

గుంటూరులో జిల్లా కలెక్టర్‌ గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను సూచించేదిగా ఈ ఆర్డర్ కాపీ ఎర్ర‌టి మ‌ర‌క‌ల‌తో నిండి ఉంది. రాజ‌కీయ నేప‌థ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌ లో కనిపించనున్నాడు.

Also Read : ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular