Sunday, January 19, 2025
HomeసినిమాAnimal: ఫస్టాఫ్ తో మాత్రమే మెప్పించే 'యానిమల్' 

Animal: ఫస్టాఫ్ తో మాత్రమే మెప్పించే ‘యానిమల్’ 

Mini Review: సందీప్ రెడ్డి వంగా ఇంతకు ముందు చేసిన సినిమా చూస్తే, రొటీన్ కి భిన్నంగా ఆయన వెళ్లడం కనిపిస్తుంది. అదే సినిమాను హిందీలో చేస్తే అక్కడి ఆడియన్స్ కి కూడా కొత్తగానే అనిపించింది. తెరపై పాత్రలకైనా కొన్ని హద్దులు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ ఆ పాత్రలను ఆయన నడిపించే విధానాన్ని కొంతమంది ఎంజాయ్ చేశారు. అలాంటి తరహాలోనే ఈ సారి కూడా ‘యానిమల్’ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. రణ్ బీర్ కపూర్ – రష్మిక కాంబినేషన్లో నిర్మితమైన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది.

సాధారణంగా తమను ఎంతగానో ప్రేమించే తండ్రి కోసం పిల్లలు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. కానీ తనని ఏ మాత్రం పట్టించుకోని తండ్రి కోసం, ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక కొడుకు కథను ఈ సినిమా మనకి చూపిస్తుంది. తండ్రికి హాని తలట్టే దుష్టశక్తులను దారుణంగా చంపేయడం  చూపిస్తుంది. తండ్రితో పాటు భార్య చెబుతున్నా అతను తన పద్ధతిని మాత్రం మార్చుకోడు. యధేచ్చగా సాగిపోయే హింసకి దర్శకుడు అక్కడక్కడా రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చాడు.

ఈ సినిమాలో శక్తికపూర్ .. ప్రేమ్ చోప్రా .. వివేక్ ఒబెరాయ్ వంటి సీనియర్ స్టార్స్ ఉన్నారు. అయినా వాళ్ల పాత్రలు నమ మాత్రం .. ఒకరకంగా అతిథి పాత్రలుగా అనుకోవాలి. హీరో అంత వైల్డ్ గా ప్రవర్తించడమేంటి అనుకోవద్దు .. అడగొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ‘యానిమల్’ అనే టైటిల్ తోనే ఆ విషయం చెప్పేశారు. ఈ సినిమా ఫస్టాఫ్ కి మించి సెకండాఫ్ ను సందీప్ చూపించలేకపోయాడు. ఎలాంటి పస లేకుండా సెకండాఫ్ నడుస్తుంది.  ఫస్టాఫ్ మాదిరిగా సెకండాఫ్ ఉన్నా, తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉండేదేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్