Sunday, January 19, 2025
Homeసినిమా‘ఇక్షు’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

‘ఇక్షు’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకం పై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా రూపొందుతోన్న సినిమా ‘ఇక్షు’. ఋషిక దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు,  డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో వస్తున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అనంతరం డైరెక్టర్ రిషిక మాట్లాడుతూ “మా హీరో రామ్ అగ్నివేశ్ మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న హీరోలా నటించాడు. ఈ రోజు తన జన్మదినం సందర్బంగా మా ఇక్షు సినిమా ఏ.వి రిలీజ్ చేశాం, ఈ ఫస్ట్ లుక్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. త్వరలోనే  మా సినిమా రిలీజ్ చేస్తాం, మా హీరో భవిస్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రొడ్యూసర్ మాట్లాడుతూ  “మా హీరో రామ్ అగ్నివేశ్  ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి డైలాగ్ సింగిల్ టేక్ లో చేశాడు మా హీరో. లొకేషన్ లో కూడా సింగల్ టేక్ ఆర్టిస్ట్ గా మా ఇక్షు టీం నుంచి ప్రశంసలు అందుకున్నాడు. గతంలో మేము రిలీజ్ చేసిన టీజర్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభించింది. త్వరలో సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్