Sunday, January 19, 2025
HomeసినిమాProject K: ప్రభాస్ లుక్ పై అభిమానుల అసంతృప్తి

Project K: ప్రభాస్ లుక్ పై అభిమానుల అసంతృప్తి

ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే జంటగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై  అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి రికార్డులు క్రాస్ చేసే సత్తా ఈ సినిమాకి ఉందన్నది అందరి నమ్మకం. ప్రభాస్ అభిమానులు అయితే.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

అయితే ఇటీవల  విడుదల చేసిన దీపికా పడుకునే లుక్ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ లుక్ రిలీజ్ చేశారు. యుద్ధ రంగంలో అడుగుపెట్టిన వీరుడిలా ప‌రిచ‌యం చేశారు. అయితే.. ఈ లుక్ సైతం అంతగా ఆకట్టుకోలేదు. ఎవ‌రిదో శ‌రీరానికి ప్ర‌భాస్ త‌ల తీసుకొచ్చి అతికించిన ఫీలింగ్ క‌లిగింది.

ప్రభాస్,  దీపికా లుక్ అనుకున్నంతగా ప్రజాదరణ పొందకపోవడంతో ఫస్ట్ టైమ్  సినిమాపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. అయితే.. కేవలం లుక్ చూసి ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదని.  నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఎంతగానో తపిస్తున్నాడని మరికొందరి వాదన. టీజర్ అండ్ ట్రలర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు క్లారిటీ వస్తుంది. లుక్స్  పై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని మరింత కేర్ తీసుకుంటారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్