First look soon: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్నిభారీ చిత్రాల నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. ఇది చరణ్ 15వ, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం. చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మూడవ షెడ్యూల్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కీలకమైన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే… మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని తెలిసింది. త్వరలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీని 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
Also Read : ‘గుడ్ లక్ సఖి సినిమా సూపర్ హిట్ కావాలి : చరణ్ ఆకాంక్ష