Thursday, March 19, 2026
Homeసినిమా'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ రానుందా?

‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ రానుందా?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబినేషన్లో తాజాగా రూపొందుతోన్న మూడో  సినిమా ‘గుంటూరు కారం’.  ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ కు జంటగా ముందుగా పూజా హేగ్డేను అనుకున్నారు కానీ… ఆ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.  ఆమె స్థానంలో  మీనాక్షి చౌదరి వచ్చింది. క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తుంది. ప్రస్తుతం  హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే.. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సినిమా నుంచి అప్ డేట్ ఉంటుందా..? ఉండదా..? అనేది డౌట్ గా ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే… మహేష్‌ పుట్టినరోజునాడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

తాజా వార్త ఏంటంటే.. గుంటూరు కారం కోసం ఫస్ట్ సింగిల్ ను ముంబాయిలోని స్టూడియోలో రికార్డ్ చేసిన థమన్ అతి త్వరలోనే మహేష్‌ బాబుకు వినిపించనున్నారట. ఆ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని.. అలాగే దీని ట్యూన్ థమన్ అదరగొట్టారని.. టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ నుంచి ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ గురించి అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular