Sunday, January 19, 2025
Homeసినిమా'ఖుషి' నుంచి మెలోడి సాంగ్ రిలీజ్

‘ఖుషి’ నుంచి మెలోడి సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ‘ఖుషి’ మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. వాటిని రెట్టింపు చేసేలా విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ సాంగ్ కనిపిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు. ఈ గీతాన్ని శివ నిర్వాణ రాయడం ఓ విశేషమైతే.. ” నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే” అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం.

 ‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. “, నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. ” అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది. ఏ సినిమా నుంచి అయినా మొదటి పాట వస్తోందంటే అది ఆ మూవీ ఫ్లేవర్ ను తెలియజేస్తుంది. ఖుషి నుంచి వచ్చిన ఈ గీతం కూడా ఓ ప్లెజెంట్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అనేలా కనిపిస్తోంది. శివ నిర్వాణే నృత్యరీతులు సమకూర్చిన ఈ గీతాన్ని కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్