Thursday, March 19, 2026
Homeసినిమా‘కృష్ణ వ్రింద విహారి' నుంచి ఏప్రిల్ 9న మొదటి పాట

‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి ఏప్రిల్ 9న మొదటి పాట

First Song: యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇటివలే విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది.

చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రేక్షకులని పాటలతో అలరించడానికి సిద్దమౌతుంది. మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని చిత్రీకరించారు. ఈ పాటలో నాగశౌర్య-షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా వుంటుంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read : సోమవారం ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular