Friday, March 13, 2026
Homeసినిమా'ఓ కల' ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన గుణ్ణం, యేలేటి

‘ఓ కల’ ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన గుణ్ణం, యేలేటి

Dream: ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్ల పై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ కల’. ఈ చిత్రం ఫస్ట్ సాంగ్ ని ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు సంయుక్తంగా నేడు విడుదల చేశారు. విడుదల అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ఓ కల మూవీ ఫస్ట్ సాంగ్ చాలా ఫ్రెష్ గా, చాలా కొత్తగా ఉంది. ఇందులోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు దీపక్ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు.

దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తీసుకువచ్చిన గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ యేలేటి గార్ల చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ విడుదలవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది.. సినిమా విషయానికి వస్తే.. ఇది చక్కని ప్రేమకథ. హీరో గౌరీశ్..  చంద్రశేఖర్ యేలేటిగారికి బంధువు.  ప్రతి సీన్ ని చక్కగా అర్థం చేసుకుని నటించాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. ప్రేక్షకులు మంచి ప్రేమ కథను చూసి చాలా కాలం అవుతుంది. ఆ లోటును మా చిత్రం తీరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను..’’ అని తెలిపారు.

Also Read : ‘ఘోస్ట్’ త‌ర్వాత నాగ్ సినిమా ఎవ‌రితో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular