Sunday, March 15, 2026
HomeTrending NewsFish Food Festival: వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్

Fish Food Festival: వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్

మృగశిర కార్తె సందర్బంగా వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ కు భారీ ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జూన్ 8,9,10 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో మృగశిర కార్తె సందర్బంగా నిర్వహించనున్న ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో కలిసి మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ప్రై, కర్రీ, బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం ఉపాది పొందే విధంగా అన్ని జిల్లాలకు చెందిన మహిళా మత్స్యకారులకు చేపలతో వివిధ రకాల వంటకాల తయారీ పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారి భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్ లో 20 నుండి ౩౦ వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు.

అదేవిధంగా ప్రతి చోట విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రి వర్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వివరించారు. ఫెస్టివల్ కు వచ్చే వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతనంగా లక్ష మందికి మత్స్య సొసైటీ లలో సభ్యత్వాలు కల్పించే విధంగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మంత్రి గుర్తుచేశారు. అంతకు ముందు మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మన్ గా నియమితులైన పిట్టల రవీందర్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular