Sunday, March 8, 2026
HomeTrending Newsమత్స్యకారులు సురక్షితం

మత్స్యకారులు సురక్షితం

సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన  శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్‌ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.   ఈ నెల 7న చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి బోటులో మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 16 నుంచి వీరంతా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో  కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం కు చెందినవారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి కోసం వారంతా చెన్నైకి వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. . శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular