Tuesday, March 17, 2026
HomeTrending Newsఅజ్మీర్ లో రుబాత్ పై సంప్రదింపులు  

అజ్మీర్ లో రుబాత్ పై సంప్రదింపులు  

చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీలు జె.పి,మౌలాలీ,పహాడీ షరీఫ్ దర్గాలు, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులు.. అజ్మీర్ దర్గా వద్ద రుబాత్, కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణాలకు నెలకొన్న అడ్డంకులను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జె.పి,మౌలాలీ, పహడీషరీఫ్ దర్గాలతో పాటు మక్కా మసీదు,అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులు.. అజ్మీర్ దర్గా, క్రిస్టియన్ భవన్, ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణాలకు నెలకొన్న అడ్డంకుల గురించి శనివారం మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ సమయంలో జె.పి దర్గా వద్ద పార్టీ ముఖ్యులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని చెప్పిన విషయాన్ని మంత్రులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దర్గాను సందర్శించి దీని విస్తరణ, అభివృద్ధికి 50కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. భూసేకరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని, సంబంధిత వ్యాపారులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆదేశించారు.అజ్మీర్ దర్గా వద్ద రుబాత్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా అధికారులను కోరారు.

నగరంలో Wakf బోర్డు కు చెందిన 11విలువైన ఆస్తులను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా లీజుకు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి త్వరలో మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. పహాడీషరీఫ్ దర్గా వద్ద ర్యాంప్,సిసి రోడ్డు, మౌలాలీ దర్గా, మక్కా మసీదు,అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా కొప్పుల ఈశ్వర్,మహమూద్ అలీలు అధికారులకు పలు సూచనలు చేశారు, సలహాలు, ఆదేశాలిచ్చారు.

ఉన్నత స్థాయి సమీక్ష లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, Wakf బోర్డు ఛైర్మన్ సలీం,మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్, Wakf బోర్డు డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, క్రిస్టియన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular