Sunday, January 19, 2025
HomeTrending NewsBird walk: హైదరాబాద్ లో ఫారెస్ట్ ట్రేక్ పార్క్

Bird walk: హైదరాబాద్ లో ఫారెస్ట్ ట్రేక్ పార్క్

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మరియు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ట్రేక్ పార్క్ లో బర్డ్ వాక్ (పక్షుల వీక్షణ) ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నార్సింగి దగ్గర, తెలంగాణ పోలీస్ అకాడమీ వెనక గల ‘ఫారెస్ట్ ట్రేక్ పార్క్’ ని, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ వాసులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, వినోదాన్ని పంచడం కోసం నూతనంగా ఏర్పాటు చేసింది. ఫారెస్ట్ ట్రేక్ పార్క్ లో బర్డ్ వాక్ (పక్షుల వీక్షణ) కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారిగా ఈ పార్కులో బర్డ్ వాక్ జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 30 మంది హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ నుండి మరియు 15 మంది పక్షి ప్రేమికులు మొత్తం 45 మంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం టి.ఎస్.టి.డి.సి. అసిస్టెంట్ డైరెక్టర్ ఎకో – టూరిజం డా.జి . స్కైలాబ్ జెండా ఊపి ప్రారంభించారు. బర్డ్ వాక్ లో సుమారుగా 30 రకాల పక్షులను సభ్యులు గుర్తించారు. బ్లూ ఫేసుడు మల్కోవా, కాపర్ స్మిత్ బార్బేట్, కామన్ అయోరా, ఏషియన్ కోయల్, Rufous treepie, బ్లాక్ డ్రోంగో, లిటిల్ గ్రెబ్బ్, వుడ్ సాండ్ పైపర్, షిక్రా వంటి పక్షులను గుర్తించారు.

పార్కును ఎంతో ఆర్షణీయంగా మరియు పక్షుల ఆవాసానికి అనువుగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు తీసుకుంటున్న చర్యలను బర్డింగ్ పాల్స్ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో డా. జి. స్కైలాబ్ మాట్లాడుతూ ఈ యొక్క పార్కుకి విచేస్తున్న విసిటర్స్ అందరికి అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ట్రేక్కింగ్ రూట్స్, 8 వాకింగ్ పాత్, గజేబోలు, రచ్చబండలు, ఓపెన్ జిమ్ ఇలా ఎన్నో వసతులు కల్పించాం అని చెప్పారు.

వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి ఐ. ఎఫ్. ఎస్. మాట్లాడుతూ మేము డెవలప్ చేస్తున్న ప్రతి ఒక్క పార్క్ ని బర్డ్స్ కి, జంతువులకి, లిజర్డ్స్ కి ఆవాసంగా, మరియు విచ్చేసే విసిటర్స్ కి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేటివ్ మరియు బాగా నీడని ఇచ్చే మొక్కలను ఎక్కువగా ఈ పార్క్ లో నాటినట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో టి.ఎస్.ఎఫ్. డి. సి. అసిస్టెంట్ డైరెక్టర్. డా. జి. స్కైలాబ్, ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్ కల్యాణపు సుమన్, రేంజ్ ఆఫీసర్ లు లక్ష్మారెడ్డి, మధు, సూపెర్వైసర్ శ్రీకాంత్, బర్డింగ్ పాల్స్ కళ్యాణ్, విజయ్, స్వాతి. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్