Forest University : సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్.సి.ఆర్.ఐ) లో బి.ఎస్సీ. ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ను ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్.సి.ఆర్.ఐ. లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.
ఇందులో భాగంగా ‘అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్’ (ఎ.సి.ఎఫ్.) విభాగంలోని ఉద్యోగాల్లో 25 % రిజర్వేషన్లు, ‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్’ (ఎఫ్.ఆర్.ఒ.) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు, ‘‘ఫారెస్టర్స్’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997) మరియు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000) లలో సవరణలు చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది.
తెలంగాణలో ‘ఫారెస్ట్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేబినేట్ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినేట్ కు అందించగా, వచ్చే కేబినేట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను కేబినేట్ ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.