Tuesday, April 1, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సిఎం జగన్ తో అనిల్‌కుంబ్లే భేటీ

సిఎం జగన్ తో అనిల్‌కుంబ్లే భేటీ

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత క్రికెటర్‌, భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు చెప్పారు. అంతేకాక క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని ఆయన సీఎంను కోరారు. ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామని, ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని ఆయన సీఎంకు వివరించారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని కుంబ్లే చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్