మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స కోసం ఈటలను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. కాళ్లకు పొక్కులు, నొప్పులతోపాటు తీవ్ర జ్వరంతో ఈటల బాధపడుతున్నారు. వీణవంక మండలం కొండపాక వద్ద ఆయన పాదయాత్ర చేసి నిలిపివేశారు.
ఈటల రాజేందర్ పాదయాత్ర 12 వ రోజు కొనసాగింది. ఇప్పటివరకు 221 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. రోజుకు దాదాపు 15 కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో చాలా మందిని కలుస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పాదయాత్ర కొనసాగించడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.