వైఎస్సార్సీపీ ఐదో విడత అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల జాబితాను విడుదల చేసింది. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట; అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం ఎంపి అభ్యర్ధులుగా ఖరారు చేశారు. సిట్టింగ్ ఎంపిలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, వల్లభనేని బాల శౌరి స్థానంలో వీరిని ఎంపిక చేశారు. గత జాబితాలో తిరుపతి ఎంపి నుంచి సత్యవేడు అసెంబ్లీకి మార్చిన ఎం. గురుమూర్తిని తిరిగి తిరుపతి పార్లమెంట్ సమన్వయకర్తగాను; సత్యవేడు అసెంబ్లీకి నూకతోటి రాజేష్ ను; కాకినాడ ఎంపి అభ్యర్ధిగా చలమశెట్టి సునీల్ లను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ జాబితాను మీడియాకు విడుదల చేశారు.
గత జాబితాలో అరకు వ్యాలీ అసెంబ్లీ అభ్యర్ధిగా ఎంపిక చేసిన ప్రస్తుత ఎంపి గోడ్డేటి మాధవి స్థానంలో మత్స్యలింగంను, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా డా. సింహాద్రి చంద్రశేఖర్ ను నియమించారు.