కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. జగన్ ఓదార్పు యాత్ర కి మద్దతిచ్చి తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావం నుంచి కెసిఆర్ ఉద్యమ ద్రోహులకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రులతో సహా ఉన్నత పదవుల్లో ఎక్కువమంది ఉద్యమ ద్రోహులే ఉన్నారన్నారు.
రాబోయే ఉపఎన్నికల్లో గెలిచేందుకు తెరాస నేతలు హుజూరాబాద్ లో 150 కోట్ల నగదు పంపిణీ చేశారని ఈటెల ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు నమ్మకం లేని కేసీఆర్ ప్రజల్ని కాకుండా పైసలను నమ్ముకున్నాడన్నారు. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న హామీలను అమలు చేస్తున్నాడు. ప్రజల మీద ప్రేమ కన్నా హుజురాబాద్ లో గెలుపు కోసమే చేస్తున్నాడు. నా రాజీనామాతో ఈ మాత్రం జర్గుతున్నందుకు సంతోస్తం. పనిలో పనిగా నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇవ్వాలి. నేను సీరియస్ రాజకీయ నాయకుణ్ణి ప్రజల వెంట ఉంటాను, ప్రజల్లో ఉంటానన్న ఈటెల డ్రామా మాస్టర్ ని కాదన్నారు.
ప్రజలకు చేరువయ్యేందుకు నాకున్న ఆప్షన్ పాదయాత్ర మాత్రమే అని, పాదయాత్ర కొనసాగిస్తానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 3,4 రోజులు వాకింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత పాద యాత్ర మొదలు పెడతానని వెల్లడించారు.