Sunday, November 24, 2024
HomeTrending Newsప్రపంచ దేశాలకు భారత్ ఆశాదీపం - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రపంచ దేశాలకు భారత్ ఆశాదీపం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

G20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం ప్రపంచంలో దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు అది ప్రస్తుతం అవసరమని, ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు ఆదివారం హైదరాబాద్ లోని మ్యారియట్ హోటల్ లో జరిగిన ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. “జీ20 సదస్సుపై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు జీ20 సదస్సు ఎంతో అవసరం. మోదీ దేశ ప్రధాని అయ్యాక ప్రతీ రంగంపై దృష్టి సారించారు. దేశంలోని అన్ని రంగాలపై నరేంద్ర మోడీ మార్క్ ఉంది. దేశానికి సంబంధించిన అస్థిత్వం కొట్టొచ్చినట్లు కనపడేలా చేశారు.జాతీయరహదారులను ప్రారంభించిన సమయంలో వాజ్ పేయిని అందరూ విమర్శించారు. 70 వేల కోట్లు ఏ రకంగా నిధులు సమకూరుస్తారని వ్యగ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత పదేళ్లపాటు జాతీయరహదారులను పట్టించుకోలేదు. 1993లో అమెరికాలో పర్యటించిన సమయంలో ఇలాంటి రోడ్లు మనదేశానికి వస్తాయా అని నేను అనుకున్నాను. నార్త్ ఈస్ట్ లోని ప్రతీ రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానం చేశాం. నార్త్ ఈస్ట్‌లోని ప్రతీ రాజధానిని రైలు మార్గంతో కలిపే ప్రణాళిక తయారు చేస్తున్నాం. దేశంలోని అన్ని ప్రాంతాలలో అద్భుతమైన రహదారులను నిర్మించాం.
గ్రీన్ ఫీల్డ్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ హైవేస్ లను నిర్మించాం. ప్రపంచంలో తక్కువ వ్యయంతో 5జీ అందుబాటులో ఉంది భారత్‌లోనే. అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా తక్కువ రేటుకే 5జీ అందిస్తున్నాం. భారత్‌లో అద్భుతమైన ఫారన్ పాలసీ ఉన్నది. ఉక్రెయిన్, రష్యా యుద్దం సందర్భంగా భారత విద్యార్థులను తీసుకురావడంలో ఫారెన్ మినిస్ట్రీ ఏ విధంగా పనిచేసిందో గుర్తించుకోవాలి. 22వేల మంది విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకురాగలిగాం అంటే మన విదేశాంగ మంత్రిత్వశాఖ గొప్పతనమే. పాకిస్థాన్ వాళ్లు చంపేవాళ్లు… మనం చచ్చేవాళ్లమనే ఆలోచన గతంలో ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. పటాన్‌కోట్ ఘటనకు ధీటైన సమాధానం చెప్పగలిగాం. ఇండోనేషియాలో జీ20 సదస్సు జరిగితే కేవలం దేశ రాజధాని బాలిలో మాత్రమే నిర్వహించారు. కానీ దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో జీ20 సదస్సులు జరగాలని ఆలోచించిన వ్యక్తులు మోదీ, జయశంకర్. ఇండియాలో 56 నగరాల్లో 250 సమావేశాలు జరిగేలా ఏర్పాటు చేశాం.

జి20 దేశాల ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతుంటే స్థానిక ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. సమావేశాలకు వచ్చి భారత్ ఆతిథ్యం స్వీకరిస్తున్న G20 దేశాల ప్రతినిధులు ఇండియా సంస్కృతి, భాష, విధానాలను ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్ గా తెలియజేస్తారని ప్రధాని మోడీ ఆలోచించారని ప్రస్తుతం అదే జరుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా భారత్ గురించి నేడు మాట్లాడుకుంటున్నారని అని అన్నారు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ మాట్లాడుతూ G20 దేశాలకు నేతృత్వం వహిస్తున్నా భారత్ విదేశాంగ విధానాలను వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్