Saturday, January 18, 2025
Homeసినిమానాగ్ కోసం ఆ.. నలుగురు

నాగ్ కోసం ఆ.. నలుగురు

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరంలో బంగార్రాజు, బ్రహ్మాస్త్రం చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే… దసరాకి వచ్చిన ది ఘోస్ట్ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది, దీంతో నాగార్జున ఆలోచనలోపడ్డారు. ప్రేక్షకుల అభిరుచి మారింది… హీరో ఎవరైనా కంటెంట్ బాగుంటేనే సినిమా చూస్తున్నారు, అందుకనే తదుపరి సినిమా విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట నాగార్జున.

ది ఘోస్ట్ మూవీ తర్వాత గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహనరాజా డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ చేయాలనుకున్నారు. కథ ఓకే అయ్యింది. ది ఘోస్ట్ రిలీజ్ తర్వాత ఈ సినిమాను అనౌన్స్ చేస్తానన్నారు. అయితే.. నాగార్జున ఇటీవల కాలంలో చేసిన యాక్షన్ మూవీస్ వైల్డ్ డాగ్, ది ఘోస్ట్.. ఈ రెండు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో మళ్లీ మరో యాక్షన్ మూవీ చేయడం కరెక్ట్ కాదేమో అని మోహనరాజా సినిమాను హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడునాగార్జున కొత్త కథల పై దృష్టిపెట్టారు. సీనియర్‌ దర్శకులతోపాటు, కొత్తతరం నుంచీ ఆయన కథలు వింటున్నారు.

ఇప్పుడు నాగార్జున కోసం నలుగురు కథలు రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే… గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహనరాజా ఓ భారీ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారు. అలాగే మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కూడా ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. రైటర్ బెజవాడ ప్రసన్న ఓ పీరియాడిక్ స్టోరీ,  మరో రైటర్ కూడా స్టోరీ రెడీ చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఏదో కొత్త పాయింట్ ఉంటేనే కానీ.. జనాలు థియేటర్లకు రావడం లేదు. అలాంటి కథతోనే నాగార్జున సినిమా చేయాలని అనుకుంటున్నారట. మరి.. ఈసారి ఎలాంటి కథతో వస్తారో.. ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్