నూతనంగా నిర్మించిన డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని రెండో అంతస్తులోని తన చాంబర్ లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం బాద్యతలు స్వీకరించారు. ముందుగా మంత్రి దంపతులు వేదపండితుల మంత్రాలలు, మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి చాంబర్ లో అడుగుపెట్టారు. మంత్రి తన చాంబర్ లో బాధ్యతలను చేపట్టిన అనంతరం ఉచిత చేప పిల్లల పంపిణీ కి సంబంధించిన పైల్ పై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వస్తుంది. వచ్చే సంవత్సరం వర్షాకాలంలో కూడా రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేసేందుకు అవసరమైన చేప పిల్లల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలిచే ఫైల్ పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి మానసపుత్రిక గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం అమలు కోసం NCDC నుండి రుణం మంజూరుకు అవసరమైన ఫైనల్ ప్రపోజల్స్ కు సంబంధించిన ఫైల్ పై రెండో సంతకం చేశారు. 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే అర్హులలో 50 శాతం మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ లో అత్యాధునిక టెక్నాలజీ తో చేపట్టిన మెగా డెయిరీ నిర్మాణ పనుల కోసం 75 కోట్ల రూపాయల గ్రాంట్ ను విడుదల చేస్తూ మరో ఫైల్ పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ సంతకం చేశారు. అనంతరం మంత్రి కి పలువురు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, MP రంజిత్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, MLC లు MS ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, సురభి వాణిదేవి, MLA లు దానం నాగేందర్, మాగంటి గోపినాద్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, కార్పోరేషన్ చైర్మన్ లు సోమా భరత్ కుమార్ గుప్తా, అనిల్ కుర్మాచలం, దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేడే రాజీవ్ సాగర్, హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ యాదవ్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, FDC ED కోశోర్ బాబు, ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.